ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు
యెషయా 64:5
నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతివిు బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?
ద్వితీయోపదేశకాండమ 8:3

ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.

యోబు గ్రంథము 33:19-28
19

వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునొందును

20

రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును

21

వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును

22

వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.

23

నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల

24

దేవుడు వానియందు కరుణజూపి పాతాళములోనికి దిగివెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.

25

అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకన్న ఆరోగ్యముగానుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.

26

వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.

27

అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు

28

కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.

కీర్తనల గ్రంథము 71:20

అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.

మత్తయి 4:4

అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

1 కొరింథీయులకు 11:32

మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

2 కొరింథీయులకు 4:17

మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

హెబ్రీయులకు 12:10

వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.

హెబ్రీయులకు 12:11

మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.