
ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నా కిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము . సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును .
మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను ; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను .
నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొన లేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తి పరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి .
ఇదిగో పంటచేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కు నట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును .
ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని ; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి .
మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు , దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే . దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు , వారియందు ఆయన సంతోషపడును ;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.