ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా
దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.
ఆ స్త్రీ గర్భవతియై నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా
నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.
మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించుచున్నారు;