man
సామెతలు 22:24

కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగియుండకుము

సామెతలు 22:25

నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

సామెతలు 25:28

ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

సామెతలు 29:22

కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

1 సమూయేలు 20:30

సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి --ఆగడగొట్టుదాని కొడుకా , నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా ?

1 సమూయేలు 20:31

యెష్షయి కుమారుడు భూమి మీద బ్రదుకు నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము , నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.

1 సమూయేలు 22:7-23
7

సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను -బెన్యామీనీయులారా ఆలకించుడి . యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా ? మిమ్మును సహస్రా ధిపతులుగాను శతాధి పతులుగాను చేయునా ?

8

మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు ? నా కుమారుడు యెష్షయి కుమారుని తో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయ లేదే . నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింత లేదే .

9

అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి -యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని .

10

అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి , ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా

11

రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకుల నందరిని పిలువ నంపించెను . వారు రాజు నొద్దకు రాగా

12

సౌలు అహీటూబు కుమారుడా , ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను .

13

సౌలు -నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి , అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితి రేమని యడుగగా

14

అహీమెలెకు -రాజా , రాజునకు అల్లుడై నమ్మకస్థుడై , ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకు లందరిలో ఎవడున్నాడు ?

15

అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా ? అది నాకు దూరమగునుగాక ; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

16

రాజు అహీమెలెకూ , నీకును నీ తండ్రి ఇంటివారి కందరికిని మరణము నిశ్చయము అని చెప్పి

17

యెహోవా యాజకులగు వీరు దావీదు తో కలిసినందునను , అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియ జేయక పోయినందునను మీరు వారిమీద పడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లక యుండగా

18

రాజు దోయేగుతో -నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను . అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదు గురిని ఆ దినమున హతముచేసెను .

19

మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తి వాత హతము చేసెను; మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱలనేమి అన్నిటిని కత్తి వాత హతముచేసెను.

20

అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

21

సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా

22

దావీదు -ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని ; నీ తండ్రి యింటి వారి కందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.

23

నీవు భయ పడక నాయొద్ద ఉండుము , నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

1 సమూయేలు 24:17-22
17

దావీదుతో ఇట్లనెను -యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు

18

ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.

19

ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలుచేసి పంపివేయునా ? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.

20

నిశ్చయముగా నీవు రాజవగుదువనియు , ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును .

21

కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయ కుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను

22

అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను ; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లిపోయిరి .

1 సమూయేలు 26:21-25
21

అందుకు సౌలు -నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడు చేయను . దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము ; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితిననగా

22

దావీదు -రాజా , యిదిగో నీ యీటె నాయొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాని తీసికొనవచ్చును .

23

యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును.

24

చిత్తగించుము , ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమై నందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధ లన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.

25

అందుకు సౌలు దావీదా నాయనా , నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను , సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.

2 సమూయేలు 16:5

రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు

2 సమూయేలు 16:6

జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.