ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.
ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.
దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై , అందులో నిలిచియుండి , దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము .
అంతే కాదు ; శ్రమ ఓర్పును , ఓర్పు పరీక్షను , పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
శ్రమల యందును అతిశయపడుదము .
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు . మనకు అనుగ్రహింపబడిన పరిశు ద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయము లలో కుమ్మరింపబడియున్నది .
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)
గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.