ఇది
1 సమూయేలు 6:3

వారు-ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పం పక , యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను . అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్య బడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి .

1 సమూయేలు 6:9

అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్ప కీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను మొత్త లేదనియు , మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.

కీర్తనల గ్రంథము 8:3

నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

దానియేలు 2:10

అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు , ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు .

దానియేలు 2:11

రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది , దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు ; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా .

దానియేలు 2:19

అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను .

మత్తయి 12:28

దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.

లూకా 11:20

అయితే నేను దేవుని వ్రేలి తో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది .

యోహాను 11:47

కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

అపొస్తలుల కార్యములు 4:16

ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్నవారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము.