మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
మేలిమి బంగారురేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింపవలెను.
దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.
దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను
బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.
ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారురేకు పొదిగింపవలెను; వాటితో బల్ల మోయబడును.
మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.
నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.
బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,
నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను .
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తరదిక్కున , అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను .
మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను ; వీటిమీద దహనబలి పశువులును పాపపరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశువులును వధింపబడును .
గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను . అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను . ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.
దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.
అవి మూరెడు న్నర నిడివియు మూరెడు న్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.
అయితే యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.
అన్యజనులలో ఈ మర్మముయొక్క మహిమై శ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు , మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి