యెహోవా
నిర్గమకాండము 14:13

అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

1 సమూయేలు 14:23

ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను . యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.

2 దినవృత్తాంతములు 32:22

ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

కీర్తనల గ్రంథము 106:8

అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధిచేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను .

కీర్తనల గ్రంథము 106:10

వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను .

యెషయా 63:9

వారి యావ ద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వ దినము లన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

యూదా 1:5

ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.

చూచిరి
కీర్తనల గ్రంథము 58:10

ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.

కీర్తనల గ్రంథము 59:10

నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.

కీర్తనల గ్రంథము 91:8

నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

కీర్తనల గ్రంథము 92:9-11
9

నీ శత్రువులు యెహోవా , నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు .

10

గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని .

11

నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను