భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను .
ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా
భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.