దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు .
మనుష్యుడా , యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది ; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు , దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు , ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు .
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
దేశములోను పర్వత శిఖరములమీదను సస్యసమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.
భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.
అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగానుండును.
కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.
మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.
కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
వారు విని దేవుని మహిమపరచి అతని చూచిసహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.
నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.