యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగానుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
నా స్తుతికి కారణభూతుడవగు దేవా , మౌనముగా ఉండకుము
నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు .
చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంతముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.