మాటలాడకుడి
నిర్గమకాండము 32:9

మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను ; ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు .

ద్వితీయోపదేశకాండమ 31:27

నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.

2 దినవృత్తాంతములు 30:8

మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి.

యెషయా 48:4

నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

యెహెజ్కేలు 2:4

వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను , వారు తిరుగుబాటు చేయువారు

అపొస్తలుల కార్యములు 7:51

ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.