న్యాయము విధించువాడని
కీర్తనల గ్రంథము 35:28

నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

కీర్తనల గ్రంథము 51:14

దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.

కీర్తనల గ్రంథము 71:15

నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

కీర్తనల గ్రంథము 71:16

ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.

కీర్తనల గ్రంథము 98:2

యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు .

కీర్తనల గ్రంథము 111:3

ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగానుండును .

కీర్తనల గ్రంథము 145:7

నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు

సర్వోన్నతుడైన
కీర్తనల గ్రంథము 9:2

మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.

కీర్తనల గ్రంథము 92:1

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా ,

కీర్తనల గ్రంథము 92:8

యెహోవా , నీవే నిత్యము మహోన్నతుడవుగానుందువు

దానియేలు 4:17

ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి , తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.

దానియేలు 4:25

తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు , నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు ; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును ; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును .

దానియేలు 4:34

ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి , చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని ; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తర తరములకు నున్నవి.

అపొస్తలుల కార్యములు 7:48

అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?