నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారిపోవుదురు.
ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినైయున్నాను.
నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసివచ్చెను.
నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
యేసుచెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
అందుకతడునేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.
అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
అతడు ఒట్టుపెట్టుకొనినేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చినిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.
అతడు వారి తో మాటలాడునది అతని పెద్ద న్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో-నీవిక్కడి కెందుకు వచ్చితివి ? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నే నెరుగుదును ; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు ,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు , నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము .
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు , ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షంపబడును.
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.