నేను దిగిపోవుచున్నాను
కీర్తనల గ్రంథము 40:2
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
యిర్మీయా 38:6

వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.

యిర్మీయా 38:22

యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోస పుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.

అగాధ జలములలో
కీర్తనల గ్రంథము 88:6
అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
కీర్తనల గ్రంథము 88:7
నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.)
యెహెజ్కేలు 27:26-34
26

నీ కోలలు వేయువారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలుచేయును .

27

అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయి లందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు .

28

నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును ;

29

కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి

30

నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు , తమ తలల మీద బుగ్గి పోసికొనుచు , బూడిదెలో పొర్లుచు

31

నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మన శ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు .

32

వారు నిన్నుగూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రము లో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

33

సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి , విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూ పతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.

34

ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే , నీ వర్తకమును నీ యావత్స మూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

వరదలు
కీర్తనల గ్రంథము 32:6
కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
ఆదికాండము 7:17-23
17

ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.

18

జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.

19

ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.

20

పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను.

21

అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.

22

పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.

23

నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.

మత్తయి 7:25

వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

మత్తయి 26:37

పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.

మత్తయి 26:38

అప్పుడు యేసుమరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు డని వారితో చెప్పి