నాశనక్రియలు
యెహెజ్కేలు 22:1-12
1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను .

2

నర పుత్రుడా , ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా ? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియ లన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.

3

ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా , నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసి కొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి ,

4

నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను , సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను .

5

సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదానవనియు నిన్ను అపహసింతురు .

6

నీలోని ఇశ్రాయేలీయుల ప్రధాను లందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు ,

7

నీలో తలి దండ్రులు అవమానమొందుదురు , నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు , నీలో తండ్రిలేనివారును విధవరాండ్రును హింసింపబడుదురు ,

8

నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు , నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు .

9

కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు , పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి .

10

తమ తండ్రి మానాచ్ఛాదనము తీయువారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.

11

ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును , మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును , నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు .

12

నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు .

అపొస్తలుల కార్యములు 7:51

ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

అపొస్తలుల కార్యములు 7:52

మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్యచేసినవారైతిరి.

వంచనయు
కీర్తనల గ్రంథము 109:2
నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
కీర్తనల గ్రంథము 109:3
నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
యెషయా 59:7
వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
యిర్మీయా 5:26

నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.

యిర్మీయా 5:27

పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.

యిర్మీయా 9:3-5
3

విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

4

మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

5

సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

మత్తయి 26:4

యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.