
నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేల?
దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?
దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద నీ కోపము పొగరాజుచున్నదేమి?
త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి?
అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి.
యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటుచేయుట యేల?
ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపియున్నావు.
నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచియున్నావు.
అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు
త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.
అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచియున్నావు
అతని ఖడ్గము ఏమియు సాధింపకుండచేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు
అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు
అతని యవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
దేవా, నీవు మమ్మును విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?
తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుపగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
ప్రభువు సర్వకాలము విడనాడడు.
ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నే నొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకా ళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ఆలాగుననే అప్పటి కాల మందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది.
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.