వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక
క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
వానిమీద భక్తిహీనుని అధికారిగానుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పునొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక
వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక
వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక
వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక
వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురు గాక
వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక
వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములోనుంచుకొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడకయుండును గాక
ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండును గాక.
ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను .
శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది . దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను .
తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము .
(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరు గకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి , అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి , నీ లోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
నీలో రాతి మీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను .
ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ . భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును .
వారు కత్తి వాత కూలుదురు ; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణ మగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును .
నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు.
ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక
నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.