దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.
నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను.
యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహ లోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటి వారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి .
మరియు ఇబ్బందిగల వారందరును , అప్పులు చేసికొనిన వారందరును , అసమాధానముగా నుండు వారందరును , అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను . అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి .
మార్గముననున్న గొఱ్ఱెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక
అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.