అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు .తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు .
కాగావారు కేవలము శరీరులైయున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలెనున్నారనియు ఆయన జ్ఞాపకముచేసికొనెను .
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకముచేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించియున్నావు ?
నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.
నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి.
నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకముచేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.