మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
అంధకారము మరణాంధకారముగల దేశమునకు
అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు?
తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటుననుంచినయెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.
ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.
మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.
నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.
యెహోవాను , సజీవుల దేశమున యెహోవాను చూడక పోవుదును . మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని .