పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవియొగ్గుము
అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.