నా హృదయము
ద్వితీయోపదేశకాండమ 11:16

మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్తపడుడి.

ద్వితీయోపదేశకాండమ 13:6

నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని

యెషయా 44:20

వాడు బూడిదె తినుచున్నాడు , వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు .

రోమీయులకు 1:21

మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు , కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి .

రోమీయులకు 1:28

మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను .

నా నోరు ముద్దుపెట్టినయెడలను
1 రాజులు 19:18

అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దుపెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.

కీర్తనల గ్రంథము 2:12

ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

హొషేయ 13:2

ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు , తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు , అదంతయు పనివారు చేయు పనియే , వాటికి బలులను అర్పించు వారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు .