
బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను.
మరియు అతడు వారితోనిట్లనెను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానముచేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధముచేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.
డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారైయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
నేను నీతిని వస్త్రముగా ధరించుకొనియుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.
దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.
ఎవనినైనను భాదపెట్ట కయు ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహార మిచ్చి దిగంబరికి బట్ట యిచ్చి
ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్ట పరచకయు, ఆకలిగలవానికి ఆహార మిచ్చి దిగంబరికి బట్ట యిచ్చి
పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?