యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రందరును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.
మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.
దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గము లన్నిటిలో అంగలార్పు వినబడును, వీధు లన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు ; అంగలార్చు టకు వారు సేద్యగాండ్రను పిలుతురు ; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చు టకు పిలిపింతురు.
మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.
సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?