ye yourselves
యోబు గ్రంథము 21:28-30
28
అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
29
దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?
30
అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
ప్రసంగి 8:14

వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.

ప్రసంగి 9:1-3
1

నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది యంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.

2

సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.

3

అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.

ప్రతివాడు
యోబు గ్రంథము 6:25-29
25

యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

26

మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

27

మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.

28

దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా?

29

అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

యోబు గ్రంథము 13:4-9
4

మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.

5

మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

6

దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి.

7

దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

8

ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?

9

ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా?

యోబు గ్రంథము 16:3

ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

యోబు గ్రంథము 17:2

ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

యోబు గ్రంథము 19:2

ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?

యోబు గ్రంథము 19:3

పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

యోబు గ్రంథము 21:3
నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.
యోబు గ్రంథము 26:2-4
2
శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
3
జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
4
నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?