నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.
తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులులేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు
యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు ; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును .
ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి