కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నానునేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
యోబు గ్రంథము 23:3

ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

యోబు గ్రంథము 10:15

నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినైయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

యోబు గ్రంథము 31:23

దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.

కీర్తనల గ్రంథము 77:3

దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)

కీర్తనల గ్రంథము 119:120

నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.

హబక్కూకు 3:16

నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి.