బంధువులు
కీర్తనల గ్రంథము 38:11

నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు

సామెతలు 18:24

బహుమంది చెలికాండ్రుగలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.

మీకా 7:5

స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు ,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు , నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము .

మీకా 7:6

కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు , ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

మత్తయి 10:21

సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.

ప్రాణస్నేహితులు
2 సమూయేలు 16:23

ఆ దినములలో అహీతోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.

కీర్తనల గ్రంథము 55:12-14
12

నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.

13

ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.

14

మనము కూడి మధురమైన గోష్ఠిచేసియున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిరమునకు పోయియున్నవారము.

యిర్మీయా 20:10

నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.

యోహాను 13:18

మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్ప రచుకొనినవారిని ఎరుగుదును గానినాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.