
మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు.
నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
తమ దాసుడనైన నేను ఈ చిన్నవానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొనిరానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.
ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగానుండును.
అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగానుండును.
తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.