రాజుపేరట
ఎస్తేరు 3:12

మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును,వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.

1 రాజులు 21:8

అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.

ఏ మానవుడును మార్చజాలడు
ఎస్తేరు 8:5

రాజవైన తమకు సమ్మతియైనయెడలను,తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైనదాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలోనుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.

ఎస్తేరు 1:19

రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.

దానియేలు 6:8

మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.

దానియేలు 6:12-15
12

రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టిరాజా , ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా ? అని మనవి చేయగా రాజు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము ; ఎవరును దాని రద్దు పరచజాల రనెను .

13

అందుకు వారు-చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు , నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్య పెట్టక , అనుదినము ము మ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి .

14

రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి , దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని , సూర్యుడ స్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.

15

ఆ మనుష్యులు దీని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి-రాజా , రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచ జాలడు ; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలె ననిరి .

2 తిమోతికి 2:19

అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది.ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది

హెబ్రీయులకు 6:17

ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,

హెబ్రీయులకు 6:18

మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.