నా ప్రాణమును
ఎస్తేరు 7:7

రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.

1 రాజులు 20:31

అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేమువింటిమి గనుక నీకు అనుకూలమైనయెడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు పోవుదుము; అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను.

2 రాజులు 1:13

ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితో కూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవ జనుడా , దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.

యోబు గ్రంథము 2:4

అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

యిర్మీయా 38:26

నీవుయోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.

నా జనులును
ఎస్తేరు 4:8

వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.

కీర్తనల గ్రంథము 122:6-9
6
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
7
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
8
నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
9
మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.