గొప్పవిందు చేయించి
ఎస్తేరు 1:3-5
3

తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా

4

అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

5

ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను.

ఆదికాండము 29:22

లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరిని పోగుచేసి విందు చేయించి

న్యాయాధిపతులు 14:10-17
10

అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద.

11

వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి.

12

అప్పుడు సమ్సోను మీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన యెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.

13

మీరు దాని నాకు తెలుపలేకపోయినయెడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారుమేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి.

14

కాగా అతడు బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.

15

ఏడవ దినమున వారు సమ్సోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము; మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మును పిలిచితిరా? అనిరి.

16

కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్ద పడి యేడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడునేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను.

17

ఏడవదినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.

పరమగీతములు 3:11

సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.

పరమగీతములు 5:1

నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానముచేయుడి స్నేహితులారా, పానముచేయుడి.

మత్తయి 22:2

పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

లూకా 14:8

నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచి నప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండ వద్దు ; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువ బడగా

ప్రకటన 19:9

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను -గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.

బహుమతులు ఇప్పించెను
ఎస్తేరు 9:22

విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను.

1 సమూయేలు 25:8

నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు . కాబట్టి నా పనివారికి దయ చూపుము . శుభ దినమున మేము వచ్చితివిు గదా ; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము .

నెహెమ్యా 8:11

ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి,ఇది పరిశుద్ధదినము,మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.

ప్రకటన 11:10

ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.