నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి
1 రాజులు 8:28

అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

కీర్తనల గ్రంథము 74:20

లోకములోనున్న చీకటిగలచోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము

కీర్తనల గ్రంథము 130:2

ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

దానియేలు 9:17-19
17

ఇప్పుడైతే మా దేవా , దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి , ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము.

18

నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు . మా దేవా , చెవి యొగ్గి ఆలకింపుము ; నీ కన్నులు తెరచి , నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును , నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము .

19

ప్రభువా ఆలకింపుము , ప్రభువా క్షమింపుము , ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము . నా దేవా , యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే ; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

లూకా 18:1-7
1

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

2

దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను.

3

ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని

4

అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను

5

ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.

6

మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి.

7

దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?

ఆలకించుము
కీర్తనల గ్రంథము 4:1

నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

కీర్తనల గ్రంథము 5:1

యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

కీర్తనల గ్రంథము 5:2

నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.

కీర్తనల గ్రంథము 20:1-3
1

ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

2

పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.

3

ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక నీ దహనబలులను అంగీకరించును గాక.

యోహాను 17:20

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,