
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
యెహోవా , ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి
–సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు , భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక .
సర్వభూజనులారా , యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి .
అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది .
పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును . ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి
యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడైయున్నాడు భూమి కదలును .
రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము -సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు;