కళేబరము
కీర్తనల గ్రంథము 83:10

వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి .

ప్రసంగి 6:3

ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను

యెషయా 14:18-20
18

జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

19

నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

20

నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

యిర్మీయా 8:2

వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.

యిర్మీయా 16:4

వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతు వులకును ఆహారముగా ఉండును.

యిర్మీయా 22:19

అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

యిర్మీయా 36:20

శాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.

యెహెజ్కేలు 32:23-30
23

దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి , దాని సమూహము దాని సమాధి చుట్టు నున్నది , వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తి పాలై చచ్చిపడియుండిరి .

24

అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టు నున్నవి; అందరును కత్తి పాలై చచ్చిరి ; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు , వారు సున్నతిలేనివారై పాతాళము లోనికి దిగిపోయిరి , గోతిలోనికి దిగిపోయిన వారితో కూడ వారు అవమానము నొందుదురు .

25

హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను , దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతిలేనివారై హతులైరి ; వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు , హతులైన వారిమధ్య అది యుంచబడును .

26

అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి . వారందరు సున్నతిలేనివారు , సజీవుల లోకములో వారు భయంకరు లైరి గనుక వారు కత్తిపాలైరి , ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి .

27

అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండు కొనరు ; వారు తమ యుధ్దాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి , తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను .

28

నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తి పాలైన వారియొద్ద పండుకొందువు .

29

అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతు లందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి ; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారి యొద్దను వారును పండుకొనిరి .

30

అక్కడ ఉత్తరదేశపు అధిపతు లందురును సీదోనీయు లందరును హతమైన వారితో దిగిపోయియున్నారు ; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు ; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు .