అహజ్యా
2 రాజులు 8:29

రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి యాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

సంఖ్యాకాండము 16:26

అతడు ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.

2 దినవృత్తాంతములు 22:7-9
7

యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా

8

యెహూ అహాబు సంతతి వారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.

9

అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.

సామెతలు 13:20

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

2 కొరింథీయులకు 6:17

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

వనములోని నగరి
1 రాజులు 21:2

అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.

ఇబ్లెయాము
యెహొషువ 17:11

ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.

న్యాయాధిపతులు 1:27

మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొనలేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.

మెగిద్దో
2 రాజులు 23:29

అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను .

2 రాజులు 23:30

అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి . అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి .

న్యాయాధిపతులు 1:27

మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొనలేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.

న్యాయాధిపతులు 5:19

రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.

1 రాజులు 4:12

మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది.

2 దినవృత్తాంతములు 22:9

అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.