అది షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను .
ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవ జనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి ? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను .
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా , ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా ? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు
అతడు పోయి దైవ జనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసి పిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను .
అప్పుడతడు తన పరివారముతోకూడ దైవ జనుని దగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును ; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు .
అయితే ఆ దైవ జనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు , అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక
ఇశ్రాయేలు రాజు దైవ జనుడు తనకు తెలిపి హెచ్చరికచేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను . ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.
నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును , అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును ; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది .
మా పితరుల దేవా , నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు ; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను ; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.
అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమం దున్నాడు , అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను . తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా
రాజా , ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనచింతగలవారై యుండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను .
ఇతర మనుష్యుల కందరికంటె నాకు విశేష జ్ఞాన ముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు . రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును , తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.
ఎట్లనగా-శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ , పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నే నెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము .
నేను నా పడక మీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను .
ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను ; దాని పైకొమ్మలు ఆకాశము నకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూ తలమంత విశాలముగాను ఉండెను.
దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను ; దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను ; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా ,
జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి ; పశువులను దాని నీడనుండి తోలివేయుడి ; పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి.
అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి .
ఏడు కాలములు గడచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.
ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి , తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.
బెల్తెషాజరూ , నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే ; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు . నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడవంటిని .
నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు; ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును.