నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి,
గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను.
యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.
ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయుటయు దేవునివశమేగదా అని ప్రకటింపగా
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి , బలాఢ్యులను రేపుడి , యోధు లందరు సిద్ధపడి రావలెను .
మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి , మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి ; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను .
చుట్టుపట్లనున్న అన్యజనులారా , త్వరపడి రండి ; సమకూడి రండి . యెహోవా , నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము .
నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును ; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
పైరు ముదిరినది , కొడవలిపెట్టి కోయుడి ; గానుగ నిండియున్నది ; తొట్లు పొర్లి పారుచున్నవి , జనుల దోషము అత్యధిక మాయెను , మీరు దిగి రండి .
నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.