సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు , ఈమె అహిమయస్సు కుమార్తె . అతని సైన్యా ధిపతి పేరు అబ్నేరు , ఇతడు సౌలునకు పినతండ్రియైన నేరు కుమారుడు .
సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యా ధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ , ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు -రాజా , నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను .
జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు -అబ్నేరూ , నీవు మాటలాడవా ? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసి -రాజును నిద్రలేపు నీ వెవడవని అడిగెను .
అయ్యా కుమార్తెయైన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా
అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.
గోధుమలు తెచ్చెదమని వేషము వేసికొని వారు ఇంటిలో చొచ్చి, ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండియుండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొనిపోయిరి.
నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
అబ్షాలోమును ఇశ్రాయేలీయులును గిలాదుదేశములో దిగియుండిరి.
దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపువాడైన నాహాషుకుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమీ్మయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు
యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.