ఆశీర్వచనము నొందుదురు
రూతు 1:8

నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;

రూతు 2:20

నయోమి బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను . మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు , అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా

రూతు 3:10

అతడు నా కుమారీ , యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు ; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబ డింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ప్రవర్తన కంటె వెనుకటి సత్‌ప్రవర్తన మరి ఎక్కువైనది .

1 సమూయేలు 23:21

సౌలు వారితో ఇట్లనెను -మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.

1 సమూయేలు 24:19

ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలుచేసి పంపివేయునా ? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.

1 సమూయేలు 25:32

అందుకు దావీదు -నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

1 సమూయేలు 25:33

నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.

కీర్తనల గ్రంథము 115:15
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.