జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.
యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని జనులు దీవించిరి.
నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను.నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి
అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును ? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమి మీద నున్న సమస్త ప్రజల లోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను .
కాగా యెహోవా నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను ; నీమీద నాకు కటాక్షము కలిగినది , నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషే తో చెప్పగా
మోయాబీయురాలైన రూతు నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి , యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కూమారీ పొమ్మనెను .
దావీదు -నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని , యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు ; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా