
మీరు నా కట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసికొనకూడదు.
పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.
అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరేగించిరి;
మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయముచొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళెములో ఉన్న పశువు లన్నిటిమీదను తెగుళ్లు పడును.