సర్పము
యోహాను 8:44

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

అందుకు
ఆదికాండము 3:13

అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.

ద్వితీయోపదేశకాండమ 29:19

అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.

2 రాజులు 1:4

కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీదనుండి దిగి రాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను .

2 రాజులు 1:6

వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజు నొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపుచున్నావే ; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా

2 రాజులు 1:16

అతడు వచ్చి రాజును చూచి విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్న వాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే ; నీవెక్కిన మంచము మీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను .

2 రాజులు 8:10

అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చునని చెప్పుము . అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి

కీర్తనల గ్రంథము 10:11

దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

2 కొరింథీయులకు 2:11

నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.

2 కొరింథీయులకు 11:3

సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.

1 తిమోతికి 2:14

మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.