అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.
యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమముగలవైనందున ఇస్సాకు అతనిని గురుతుపట్టలేక అతనిని దీవించి
కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తల నందిరిని వాని భక్తుల నందరిని వారి యాజకుల నందరిని నాయొద్దకు పిలువనంపించుడి ; నేను బయలునకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రాని వాడెవడో వాని బ్రదుక నియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను .
దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?
దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనికను పాపి నైనట్టు తీర్పు పొందనేల ?
మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని , కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు ? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే .
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.