అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొన
నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా యెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.
లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.
ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
బహుమంది చెలికాండ్రుగలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.
చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును.
వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు
మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితివిు గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదముపొందినవాడవనిరి.
అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి.
తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను .
మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
మాట తప్పువారును అనురాగ రహితులును , నిర్దయులునైరి .
సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.