చెప్పి
ద్వితీయోపదేశకాండమ 1:10

మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.

కీర్తనల గ్రంథము 147:4
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
యిర్మీయా 33:22

ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.

రోమీయులకు 9:7
అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గానిఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును,
రోమీయులకు 9:8
అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.
ఆలాగవునని
ఆదికాండము 12:2

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

ఆదికాండము 13:16

మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింపగలిగినయెడల నీ సంతానమునుకూడ లెక్కింపవచ్చును.

ఆదికాండము 16:10

మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

ఆదికాండము 22:17

నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

ఆదికాండము 28:14

నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.

నిర్గమకాండము 32:13

నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము . నీవు వారితో ఆకాశ నక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్త భూమిని మీ సంతానమున కిచ్చెదననియు , వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను .

ద్వితీయోపదేశకాండమ 1:10

మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.

ద్వితీయోపదేశకాండమ 10:22

నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసియున్నాడు.

1దినవృత్తాంతములు 27:23
ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.
రోమీయులకు 4:18
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
హెబ్రీయులకు 11:12

అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింపశక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.