అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి . యెహోవాచేత వారి కందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొన లేదు , ఎవడును వచ్చిన వారిని చూడ లేదు , జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు .
గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
నేను ఒంటరినై యా గొప్ప దర్శనమును చూచితిని ; చూచినందున నాలో బల మేమియు లేకపోయెను , నా సొగసు వికార మాయెను , బలము నా యందు నిలువ లేదు .
నేను అతని మాటలు వింటిని ; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
అప్పుడు ఐతుకు అను నొక ¸యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి
సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.
అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.