దర్శింపగా
1 సమూయేలు 1:19

తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను

1 సమూయేలు 1:20

గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని -నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.

ఆదికాండము 21:1

యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

లూకా 1:68

–ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక

యెదుగుచుండెను
1 సమూయేలు 2:26

బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.

1 సమూయేలు 3:19

సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై యున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.

న్యాయాధిపతులు 13:24

తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.

లూకా 1:80

శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.

లూకా 2:40

బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.

లూకా 2:52

యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.