
ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నా కిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును.
మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.
నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొన లేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తి పరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.
ఇదిగో పంటచేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కు నట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.
మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.